ETV Bharat / snippets

రాష్ట్రంలో మరోసారి కిడ్నాప్ కలకలం - జగిత్యాల జిల్లాలో రెండేళ్ల బాలుడి అపహరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 11:33 AM IST

unknown person kidnapped Two years Boy
Two years boy kidnap (Etv Bharat)

Boy Kidnap in Jagtial District : జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అతనుతన అక్కతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడించాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత బాలుడి అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏవైనా కొనుక్కోమని చెప్పడంతో ఆ పాప అక్కడి నుండి కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంతలో బాలుడిని బైక్ పై ఎక్కించుకొని గుర్తుతెలియని ఆ వ్యక్తి ఉడాయించాడు. తన తమ్ముడిని ఎత్తుకెళ్లడం చూసిన బాలిక కేకలు వేస్తూ తల్లి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.