ETV Bharat / snippets

రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్‌ టాక్స్‌ ఆఫీసర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 9:02 PM IST

State tax officer Indira Kumari who was caught by ACB
ACB Raids On Commercial Taxes Office (ETV Bharat)

ACB Caught State tax officer Indira : ఓ వ్యాపారి వద్ద నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఓ వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అబిడ్స్​లోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో స్టేట్ టాక్స్ ఆఫీసర్​గా పనిచేస్తున్న ఇందిరా రెండు రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్​లో ఉందంటూ, నోటీసులు జారీ చేశారని ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

జీఎస్టీ చెల్లింపుతో పాటు భవిష్యత్​లో అతని వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే, రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. చివరకు రూ.35వేలకు ఒప్పందం కుదిరిందని, అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అబిడ్స్​లోని కార్యాలయంలో రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అధికారిణి ఇందిరాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.