ETV Bharat / snippets

చిన్నారిపై నుంచి వెళ్లిన స్కూల్​ బస్సు - అక్కడికక్కడే మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 3:34 PM IST

Student Died on the Spot
School Bus Accident in DundiGal (ETV Bharat)

Student Died on the Spot: మేడ్చల్​ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్​లో గల ఓక్లా స్కూల్​ బస్సు మహన్విత(5) అనే ఒకటో తరగతి విద్యార్థిపై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్కూల్ యాజమాన్యం విద్యార్థిని దగ్గరలోని మమత హస్పిటల్​కి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

అయితే మహన్విత బస్సు నుంచి జారిపడి మృతిచెందిందని తన తల్లిదండ్రులకు స్కూల్​ యాజమాన్యం సమాచారం అందించింది. వారు చిన్నారి మృతిచెందిన విషయం తెలుసుకుని శోక సంద్రంలో మునిగిపోయారు. స్కూల్​ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్​ను ఘటన స్థలం నుంచి స్కూల్ యాజమాన్యం పంపించేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.