ETV Bharat / snippets

మేడ్చల్​ జిల్లాలో దారుణం - భార్య వేధిస్తోందని భర్త బలవన్మరణం!

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 7:03 PM IST

Man Commits Suicide
Man Commits Suicide (ETV Bharat)

Man Commits Suicide : భార్య,ఆమె సోదరులు దాడులకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తోందని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుని బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం భూదేవి హిల్స్ లో నివసించే చిలుక శివసాగర్ (32)కి బాలాపూర్​కి చెందిన చామంతితో 2021లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే వారి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. 4 నెలల క్రితం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె సోదరులు శివసాగర్​పై దాడికి పాల్పడి పోలీస్ స్టేషన్​లో అక్రమకేసులు బనాయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చామంతి సోదరులపై పోలీసులకు శివసాగర్​ ఫిర్యాదు చేయడంతో కేసు వెనక్కి తీసుకోవాలని వారు బెదిరింపులకు గురిచేశారు. వారి వేధింపులు తట్టుకోలేక విషం తాగి చనిపోయినట్లు బాధితుడి బంధువులు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.