ETV Bharat / snippets

హైడ్రా పేరుతో ఓ విలేకరి డబ్బుల డిమాండ్ ​- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిమాండ్​

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 3:10 PM IST

Journalist Demanded The Money
Journalist Arrested and remanded (ETV Bharat)

Journalist Arrested and remanded: సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్​లో హైడ్రా పేరుతో ఓ నిర్మాణదారుడ్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన విలేకరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అమీన్ పూర్​లోని సీబీఆర్ కాలనీలో రవి అనే వ్యక్తి రెండంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. ఓ పత్రికలో విలేకరిగా పని చేసే రాము భవన నిర్మాణానికి అనుమతులు లేవని, ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారంటూ రవిని బెదిరించాడు.

ఆర్డీవో, తహసీల్దార్లతోతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్​లతో నిత్యం మాట్లాడుతుంటానని చెప్పాడు. పాతబస్తీకి చెందిన పహిల్వాన్లు కూడా తెలుసని, రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రవి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్​లో విలేకరి రాముపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, బెదిరించిన మాట వాస్తవమే అని తేలడంతో రిమాండుకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.