ETV Bharat / snippets

ఛత్తీస్‌గఢ్‌లో 25మంది నక్సలైట్ల లొంగుబాటు - ఐదుగురి తలలపై రూ.28లక్షల రివార్డు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 7:03 PM IST

Naxalites Surrender In chhattisgarh
25 Naxalites Surrender In Bijapur (ETV Bharat)

25 Naxalites Surrender In Bijapur : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్​ఓఎస్ సభ్యుడు, సీఎన్​ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై మొత్తంగా రూ.28లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎల్​ఓఎస్ సభ్యుడు, సీఎన్ఎం ప్రెసిడెంట్ వీరిద్దరిలో ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన పునరావాస విధానం, నియాద్ నెలనార్ అనే పథకాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నారని పోలీసులు పేర్కొన్నారు. బీజాపూర్‌ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 170మంది లొంగిపోగా 346 మంది నక్సలైట్లు అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.