ETV Bharat / snippets

శివాజీ పార్క్​లో సచిన్ కోచ్ విగ్రహం- ప్రభుత్వానికి తెందూల్కర్ థాంక్స్!

author img

By ETV Bharat Sports Team

Published : Aug 29, 2024, 6:41 PM IST

Sachin coach Statue
Sachin coach Statue (Source: Getty Images)

Sachin Coach Statue:క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ చిన్ననాటి కోచ్‌ రమాకాంత్ అచ్రేకర్ స్మారక విగ్రహం ఏర్పాటు ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబయి శివాజీ పార్క్‌లో 5వ నంబర్‌ గేటు సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను వి కామత్‌ మెమోరియల్ క్రికెట్‌ క్లబ్‌కు అప్పగించింది. కానీ, నిర్వహణ ఖర్చు ప్రభుత్వం భరించదు.

మహారాష్ట్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సచిన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. 'అచ్రేకర్‌ సర్‌ నాతోపాటు ఎంతోమంది క్రికెటర్ల జీవితాలపై అపారమైన ప్రభావాన్ని చూపారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. అచ్రేకర్‌ జీవితం శివాజీ పార్క్‌లో క్రికెట్ చుట్టూ తిరిగింది. ఎప్పుడూ ఆ పార్క్‌లోనే ఉండాలనేది ఆయన కోరిక. అచ్రేకర్‌ సర్‌ విగ్రహాన్ని ఆయన పని ప్రదేశంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం' అని సచిన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.