ETV Bharat / snippets

డ్రాగన్ దేశానికే తొలి స్వర్ణం - పారిస్ ఒలింపిక్స్​లో మెడల్స్ ఖాతా తెరిచింది ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 7:18 AM IST

Paris Olympics Medals Tally
Paris Olympics Medals Tally (Associated Press)

Paris Olympics 2024 Medals Tally : పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని చైనా అథ్లెట్ల్స్ టీమ్ దక్కించుకుంది. శనివారం (జులై 27) జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్​లో లిహావ్‌ షెంగ్‌-యుటింగ్‌ హువాంగ్‌ జోడీ ఈ పతకాన్ని ముద్దాడింది. 16-12తో జిహ్యాన్‌ కేయుమ్‌-హజున్‌ పార్క్‌ జంటను ఓడించింది.

అయితే పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి పతకం మాత్రం కజికిస్థాన్​కు దక్కింది. 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్‌ కంటే ముందు జరిగిన కాంస్య పోరులో ఆ దేశానికి చెందిన ఇస్లామ్‌ సత్పయేవ్‌-అలెగ్జాండ్రా జోడీ 17-5తో జర్మనీ జంటను ఓడించింది కాంస్య పతకాన్ని సాధించింది.

ఇక ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా 3 గోల్డ్​, 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకోగా, చైనా రెండు గోల్డ్​, ఒక బ్రాంజ్, అలాగే యూఎస్ ఓ గోల్డ్, 2 సిల్వర్​, 2 బ్రాంజీ మెడల్స్ సాధించి టాప్ త్రీలో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.