ETV Bharat / snippets

పారిస్​ ఒలింపిక్స్​ - ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 3:55 PM IST

source Getty Images
Paris Olympics 2024 (source Getty Images)

Paris Olympics 2024 Eight Athletes Chandigarh University : ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 మరో 10 రోజుల్లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ మెగాటోర్నీ కోసం అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చంఢీగడ్​ యూనివర్సిటీకి ఈ అరుదైన అవకాశం లభించింది.

ఎవరెవరంటే? - అర్జున్‌ బబుటా(షూటింగ్‌), భజన్‌ కౌర్‌(ఆర్చరీ), రితిక హుడా (రెజ్లింగ్‌), సంజయ్‌ (హాకీ), అక్ష్‌దీప్‌ సింగ్‌ (రేస్‌ వాకింగ్‌), యశ్‌ (కయాకింగ్‌)లతో పాటు పారాలింపియన్లు పలక్‌ కోహ్లీ (బ్యాడ్మింటన్‌), అరుణ తన్వర్‌ (తైక్వాండో) చంఢీగడ్​కు చెందిన విద్యార్థులు. వీరంతా ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా చండీగఢ్‌ యూనివర్సిటీ ఛాన్స్‌లర్, రాజ్యసభ ఎంపీ సత్నామ్‌ సింగ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.