ETV Bharat / snippets

పాక్ సెలక్టర్లకు PCB షాక్- రియాజ్, రజక్ పదవులు ఔట్- వరల్డ్​కప్ ఓటమే కారణం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 12:49 PM IST

PCB Selectors
PCB Selectors (Source: Associated Press)

PCB Selectors:2024 టీ20 వరల్డ్​కప్​లో పాకిస్థాన్ ఓటమి కారణంగా ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ వాహబ్ రియాజ్​ను ఆ పదవిలో నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. రియాజ్​తోపాటు అబ్దుల్ రజక్​పై వేటు పడింది. సెలక్షన్ కమిటీ నుంచి రజక్​ను కూడా ఆ బాధ్యతల్లో నుంచి తప్పించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, పొట్టి ప్రపంచకప్​నకు ఎంపికైన జట్టు​పట్ల సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

కనీస అవగాహన లేకుండా టీమ్​ను ఎంపిక చేశారని పలువురు సీనియర్లు ఫైరయ్యారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు, ప్లేయర్ల ఎంపిక, అనాలోచిత నిర్ణయాల నేపథ్యంలో రియాజ్​పై విమర్శలు వచ్చాయి. కాగా, టీ20 వరల్డ్​కప్​లో పాకిస్థాన్ కనీసం సూపర్ 8కు కూడా అర్హత సాధించకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక గడిచిన నాలుగేళ్లలో పీసీబీ ఆరుగురు చీఫ్ సెలక్టర్లను మార్చడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.