ETV Bharat / snippets

పారాలింపిక్స్​లో భారత్ జోరు- బ్యాడ్మింటన్​లో రెండు పతకాలు

author img

By ETV Bharat Sports Team

Published : Sep 2, 2024, 8:53 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

India Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత పారా అథ్లెట్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (SU5) ఈవెంట్​లో తులసీమతి మురుగేశన్ రజతంతో సత్తా చాటింది. కాగా, మురుగేశన్​కు ఇదే తొలి పారాలింపిక్స్​ పతకం కావడం విశేషం. ఇక ఇదే పోటీలో చైనా ప్లేయర్ యాంగ్​ స్వర్ణం దక్కించుకుంది.

మరోవైపు ఇదే ఈవెంట్​ ఫైనల్​ కంటే కాస్త ముందు మనీషా రామ్​దాస్ కాంస్యం ముద్దాడింది. కాంస్య పోరులో మనీషా 21-12, 21-8 వరుస సెట్​లలో ఆధిక్యం ప్రదర్శించి పతకం దక్కించుకుంది. ఈ క్రమంలో పారాలింపిక్స్​లో బ్యాడ్మింటన్ విభాగంలో పతకం సాధించిన తొలి మహిళా పారా అథ్లెట్​గా మనీషా రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ పకతాల సంఖ్య 11కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.