ETV Bharat / snippets

100 అడుగుల ధోనీ కటౌట్‌ - తెలుగు ఫ్యాన్స్ అభిమానం

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 3:03 PM IST

source ANI
Happy Birthday Dhoni 100 Feet Cutout (source ANI)

Happy Birthday Dhoni 100 Feet Cutout : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పుట్టినరోజు ఆదివారం(జులై 6). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మహీ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్​గా చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అలా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట దగ్గరున్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే ధోనీ 100 అడుగుల కటౌట్‌ను ఫ్యాన్స్​ ఏర్పాటు చేశారు. హైవే పక్కనే ఉండడంతో ఇది చూపరులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్​ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ బర్త్​డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరం అక్కడ ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు. అలా గతేడాది 77 అడుగుల కటౌట్​ పెట్టగా ఈ సారి 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.