ETV Bharat / snippets

'అధ్యక్ష రేసులో బైడెన్ ఉంటే గెలవడం కష్టమే'- డెమొక్రటిక్ టాప్‌ ఫండ్‌రైజర్‌ క్లూనీ సెన్సేషనల్ కామెంట్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:43 AM IST

Updated : Jul 11, 2024, 11:09 AM IST

US Elections 2024
US Elections 2024 (Associated Press)

US Elections 2024 Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు స్వపక్షంలోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన అభ్యర్థిగా ఉంటే ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ గెలవటం కష్టమని బైడెన్‌ తరఫున హాలీవుడ్‌లో టాప్ ఫండ్‌రైజర్‌గా ఉన్న దర్శకుడు, నటుడు జార్జ్‌ క్లూనీ అభిప్రాయపడ్డారు. ప్రతినిధుల సభ, సెనేట్​లోనూ ఓడిపోతామని, అందుకే కొత్త అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదని, ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్‌ ఇదే భావిస్తున్నారని తెలిపారు. గత జూన్‌లో ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం నిర్వహించినప్పుడు బైడెన్‌లో 2020 ఎన్నికల నాటి ఉత్సాహం కూడా కనిపించలేదన్నారు. ఓటమి హెచ్చరికలను విస్మరిస్తూ పోతే ట్రంప్‌ రెండోసారి గెలుస్తారని, అది ఊహంచుకుంటేనే భయంగా ఉందని క్లూనీ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగితే ట్రంప్‌దే విజయం అని అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌’ గ్రూప్‌ అధినేత జస్దీప్‌ సింగ్‌ జస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Last Updated : Jul 11, 2024, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.