ETV Bharat / snippets

మళ్లీ ఈయూ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఉర్సులా వాన్​ డెర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 8:13 AM IST

Ursula von der Leyen Reelected As European Commissio
EU commission president URSULA von der Leyen (ANI)

Ursula von der Leyen Reelected As European Commission President : యూరోపియన్ యూనియన్​ (ఈయూ) కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్​ డెర్​ లియోన్​(65) మరోసారి ఎన్నికయ్యారు. ఆమె ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో గురువారం భేటీ అయిన యూరోపియన్‌ పార్లమెంటు ఉర్సులా వాన్​ డెర్​ను ఈయూ కమిషన్‌ అధ్యక్ష పదవికి మరోసారి ఎన్నుకుంది. మొత్తం 720 మంది సభ్యులున్న ఈయూ చట్టసభలో 707 మంది హాజరుకాగా, ఉర్సులాకు అనుకూలంగా 401 ఓట్లు, వ్యతిరేకంగా 284 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లలేదు. 15 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వరుసగా రెండోసారి ఈయూ కమిషన్‌ అధ్యక్ష పదవికి ఎన్నికైన ఉర్సులా వాన్​ డెర్​ మాట్లాడుతూ, ఈయూ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పర్యావరణ పరిరక్షణకు, వలసల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.