ETV Bharat / snippets

స్పేస్ ఎక్స్ రాకెట్‌కు ప్రమాదం- దశాబ్దంలోనే తొలిసారి ఫెయిల్​- గాల్లోనే కాలిపోయి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 10:12 AM IST

SpaceX Rocket Accident
SpaceX Rocket Accident (Associated Press)

SpaceX Rocket Accident : అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఫెయిలైంది. దీంతో గురువారం రాత్రి ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోలేకపోయాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యలోనే ఉండిపోయాయి. ఫాల్కన్ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే దాని అప్పర్ స్టేజీ ఇంజిన్‌లో లోపం తలెత్తి లిక్విడ్ ఆక్సిజన్ లీకవడం వల్ల ఇలా జరిగిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది.

"ఫాల్కన్ 9 రాకెట్ ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించిన వెంటనే మా కంపెనీ ఫ్లైట్ కంట్రోలర్లు దానిలోని దాదాపు సగం ఉపగ్రహాలతో కనెక్టయ్యారు. వాటిలోని అయాన్ థ్రస్టర్లను ఉపయోగించి శాటిలైట్లను ఎగువ కక్ష్యలోకి పంపేందుకు యత్నించినా సాధ్యపడలేదు" అని స్పేస్ ఎక్స్ తెలిపింది. తప్పుడు కక్ష్యలోకి చేరిన శాటిలైట్లు గాల్లోనే కాలిపోతాయని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.