ETV Bharat / snippets

'డ్రాగన్‌' డ్రోన్​లతో రష్యాపై ఉక్రెయిన్​ నిప్పుల వర్షం- డేంజరస్ 'థర్మైట్‌' బాంబులతో అటాక్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 4:29 PM IST

Ukraine Russia War
Ukraine Russia War (AP)

Ukraine Russia War: ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిత్యం క్షిపణి దాడులతో మాస్కో దళాలు కీవ్‌ను వణికిస్తుండగా, డ్రోన్ల దండుతో ఉక్రెయిన్‌ గట్టిగా ప్రతిఘటిస్తోంది. తాజాగా రష్యా ఆక్రమిత ప్రదేశాల్లో డ్రాగన్‌ డ్రోన్లతో థర్మైట్‌ బాంబులను జారవిడుస్తున్న దృశ్యాలు ఇంటర్​నెట్​లో వైరల్‌గా మారాయి. ఖర్కీవ్‌ ప్రాంతంలోని రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ ఇటీవల డ్రోన్‌ దాడులకు పాల్పడింది. చాలా తక్కువ ఎత్తులో నుంచి ఓ డ్రాగన్‌ డ్రోన్ నిప్పుల వర్షం కురిపించింది. డ్రోన్లను థర్మైట్‌ బాంబులను అమర్చి జారవిడిచారు. దీంతో వందలాది చెట్లు కాలి బూడిదయ్యాయి. రష్యా మిలిటరీకి చెందిన కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. ఖోర్న్‌ గ్రూప్‌ పేరుతో ఉన్న టెలిగ్రామ్‌ ఛానల్‌తో ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా థర్మైట్‌ బాంబులను పిలుస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.