ETV Bharat / snippets

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 6:48 AM IST

Harini Amarasuriya
Harini Amarasuriya (AFP)

Sri Lanka New Prime Minister : శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య (54) నియమితులయ్యారు. దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మంగళవారం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్‌ గుణవర్ధన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనితో హక్కుల కార్యకర్త, విశ్వవిద్యాలయ అధ్యాపకురాలైన హరిణి అమరసూర్యను ప్రధానిగా దేశాధ్యక్షుడు దిసనాయకే నియమించారు.

శ్రీలంక పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు దిసనాయకే మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నవంబరు 14న పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.