ETV Bharat / snippets

ఏథెన్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు - ఒకరు మృతి, 15 మందికి తీవ్రగాయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 7:25 AM IST

dangerous blaze spirals out of control in Athens
Greece wildfire (AP)

Greece Wildfire : గ్రీస్‌లోని చారిత్రక నగరం ఏథెన్స్‌ సమీపంలో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. 152 ప్రత్యేక వాహనాలు, నీటిని చల్లే విమానాలను రంగంలోకి దించినా అగ్నికీలలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అగ్నికీలలు 85 అడుగుల ఎత్తు ఉన్నట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానిక మారథాన్‌ సహా ఇతర ప్రాంతాలవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.