ETV Bharat / snippets

హైద‌రాబాద్​లో స్టార్ హీరోల మ‌ధ్య 'వార్'!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 4:14 PM IST

source Getty Images
WAR 2 Movie shooting (source Getty Images)

NTR Hrithik Roshan War 2 Movie Shooting : యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, బాలీవుడ్ హీరో హృతిక్​రోషన్ కలిసి నటిస్తున్న సినిమా వార్ 2. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్​లో భాగంగా ఇది తెరకెక్కుతోంది. అయాన్ ముఖ‌ర్జీ దీన్ని డైరెక్ట్​ చేస్తున్నారు. తారక్​ ఈ మూవీలో జాయిన్ అవ్వడంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఇప్ప‌టివరకు ముంబయిలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఇక్కడ భారీ బ‌డ్జెట్​తో ఓ ప్రత్యేకమైన సెట్ వేశారని సమాచారం. ఆగ‌స్టులో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్​లో హృతిక్​రోష‌న్, ఎన్టీఆర్ మ‌ధ్య ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని సమాచారం. ఈ ఫైట్ సీక్వెన్స్ ఇంట‌ర్వెల్​లో రానుందట. అలాగే సినిమాకే హైలైట్​గా నిలువనుందని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని 2025 ఆగ‌స్టు 14న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.