ETV Bharat / snippets

'రాజధాని రౌడీ'గా రానున్న హీరో యశ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 10:16 PM IST

Source Getty Images
yash (Source Getty Images)

KGF Yash Rajadhani Rowdy Movie : రాకింగ్ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేజీయఫ్​తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం గీతూ మోహన్​దాస్​తో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పుడాయన నటించిన ఓ పాత మూవీ తెలుగులో రిలీజ్​కు రెడీ అయింది. గతంలో యశ్ నటించిన రాజధానిరౌడీ విడుదలకు సిద్ధమైంది. సంతోశ్​ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్​పై నిర్మాత సంతోశ్​ కుమార్ నిర్మించారు. కె.వి రాజు దర్శకత్వంలో హీరోహీరోయిన్‌గా యశ్​, షీనా కలిసి నటించారు. ఇప్పుడీ చిత్రాన్ని జూన్ 14న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్​మెంట్ చేశారు. మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడిన నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. ప్రకాశ్​రాజ్ పోలీస్ ఆఫీస్‌గా కీలక పాత్ర పోషించారు. తెలుగు ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారని మూవీటీమ్ ఆశిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.