Kalki 2898AD Deepika Padukone Pregnant : 'కల్కి 2898' ఏడీ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటూ తన బేబీబంప్ ఫోటోలను షేర్ చేస్తున్న దీపిక, తాజాగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బిడ్డకు జన్మనిచ్చాక ఎక్కువ సమయం బేబీతోనే గడపాలని నిర్ణయం తీసుకుందట. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రెటీలు పిల్లలను కేర్టేకర్స్కు అప్పగిస్తున్నారు. కానీ తాను అలా చేయనని, తన బిడ్డ ఆలనాపాలనా మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అలానే తన భర్త రణవీర్ సింగ్ను కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చేయాలని అనుకుంటుందట. తల్లిదండ్రుల పరిరక్షణలోనే బిడ్డ ఎదిగితే ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకుని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.