ETV Bharat / snippets

గేమ్​ఛేంజర్​ - సూపర్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:52 AM IST

source ETV Bharat
Gamechanger (source ETV Bharat)

Director Shankar Gamechanger Update : రామ్​చరణ్‌ - శంకర్‌ కాంబో గేమ్​ఛేంజర్ రిలీజ్ కాకుండా​ ఆలస్యమవుతూనే వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాపై శంకర్ ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. ‘‘నేను తీసిన తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే డైరెక్ట్​గా తెలుగులోనూ ఓ చిత్రం చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ కొన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. ఎట్టకేలకు ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’తో నా కల నెరవేరనుంది. కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో దీన్ని చేస్తున్నాను. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ మూవీ. టాలీవుడ్‌లో ఇలాంటి మాస్‌ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది’’ అని పేర్కొన్నారు. ఇది విన్న ఆడియెన్స్​ ఫుల్​ ఖుషి అయిపోతున్నారు. కాగా, సినిమాలో రామ్​చరణ్‌ డబుల్ రోల్​ చేశారని సమాచారం. కియారా అడ్వాణి హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. హీరో పాత్రకు సంబంధించి ఇటీవల షూటింగ్ పూర్తైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.