ETV Bharat / snippets

మోహన్‌లాల్‌కు అస్వస్థత- హాస్పిటల్​లో ట్రీట్​మెంట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 4:55 PM IST

Mohan lal
Mohan lal (Source: ETV Bharat)

Mohan Lal Health Update: సీనియర్ నటుడు మోహన్‌లాల్‌ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన కొచ్చిలోని ఓ హాస్పిటల్​లో చేరినట్లు సమాచారం. ఓ సినిమా షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లిన మోహన్​లాల్ అక్కడే అస్వస్థతకు గురైనట్లు సినీ వర్గాల సమాచారం. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది.

మెడిసిన్ వాడుతూ 5రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నటుడికి వైద్యులు సూచించినట్టు తెలిసింది. మోహన్‌లాల్‌ హెల్త్‌ బులెటిన్‌ అంటూ ఉన్న ఫొటోను ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో అది వైరల్​గా మారింది. అయితే ఆ మెడికల్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన తేదీ ఆగస్టు 16గా ఉండడం గమనార్హం. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.