RBI Recruitment 2024 : ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు 94 ఆఫీసర్ (గ్రేడ్-బి) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఆఫీసర్ గ్రేడ్ బి (డీఆర్) ఉద్యోగాల వివరాలు
- జనరల్ - 66
- డీఈపీఆర్ - 21
- డీఎస్ఐఎం - 07
- మొత్తం పోస్టుల సంఖ్య : 94
అర్హతలు : డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు, పని అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,200 - రూ.99,750 వరకు జీతం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 ఆగస్టు 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.