ETV Bharat / snippets

'పన్ను మినహాయింపు పరిమితిని రూ.5లక్షలకు పెంచాల్సిందే' - AIFTP

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 4:26 PM IST

Income upto Rs 5 Lakh to get full tax rebate
personal income tax (ETV Bharat)

Personal Income Tax : వ్యక్తిగత ఆదాయ పన్ను భారాన్ని తగ్గించాలని 'ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్' (AIFTP) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రానున్న కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచాలని సంఘం అధ్యక్షుడు నారాయణ్ జైన్ విన్నవించారు. దేశంలో పన్ను విధానాన్ని సరళీకృతం చేయాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు.

ముఖ్యంగా రూ.5 లక్షల - రూ.10 లక్షల మధ్య ఆదాయంపై 10%; రూ.10 లక్షల - రూ.20 లక్షల మధ్య ఆదాయంపై 20%; రూ.20 లక్షలకు పైబడిన ఆదాయంపై 25% పన్ను విధించాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సర్‌ఛార్జి, సెస్‌లను తొలగించాలని సూచించారు.

విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని, కానీ విద్యా సెస్‌ను ఎలా సద్వినియోగం చేస్తున్నారో ప్రభుత్వం సరిగ్గా వివరించడం లేదని జైన్‌ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.