ETV Bharat / snippets

RBI కీలక వడ్డీ రేట్లు పెంచుతుందా? తగ్గిస్తుందా? - నిపుణుల అంచనా ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

RBI
RBI (ANI)

RBI Policy Review : ఆర్‌బీఐ రెపోరేటును 6.5శాతం వద్ద కొనసాగించే అవకాశం ఉందని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం, ముడిచమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటును తగ్గించే అవకాశం లేదని భావిస్తున్నారు. బహుశా డిసెంబరులో రేట్ల కోత ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల వడ్డీరేట్ల సవరణ విషయంలో ఆర్‌బీఐ అప్రమత్తంగా వ్యవహరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరల పెరుగుతుండడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లలో కోత ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలోనే ఆర్‌బీఐ రేట్‌ సెట్టింగ్‌ ప్యానల్- మానిటరీ పాలసీ కమిటీని పునరుద్ధరించింది. కొత్తగా ముగ్గురు వ్యక్తులను నియమించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ‘ద్రవ్య పరపతి విధాన కమిటీ’ అక్టోబర్‌ 7-9 మధ్య సమావేశం కానుంది. సమావేశ నిర్ణయాలను అక్టోబర్‌ 9న ప్రకటించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.