ETV Bharat / snippets

కోర్టులో IRS ఆఫీసర్​పై ఫైరింగ్​- అల్లుడ్ని కాల్చిచంపిన మాజీ AIG

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 6:06 PM IST

PUNJAB EX AIG KILLS SON IN LAW
PUNJAB EX AIG KILLS SON IN LAW (ETV Bharat)

సొంత అల్లుడిని మాజీ పోలీసు అధికారి కోర్టు ఆవరణలోనే కాల్చిచంపిన ఘటన చండీగఢ్‌లో కలకలం రేపింది. సాగునీటి శాఖలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న IRS అధికారి హరిప్రీత్‌ సింగ్‌ను ఆయన మామ, మల్వీందర్ సింగ్ సిద్ధు కాల్చి చంపారు. IRS అధికారి హరిప్రీత్ సింగ్‌కు ఆయన భార్యకు మధ్య గొడవలు కోర్టుకు చేరాయి. ఆ కేసు చండీగఢ్‌ కుటుంబ న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాలు కోర్టులో మధ్యవర్తిత్వ సెషన్‌కు హాజరయ్యాయి. మల్వీందర్‌ సింగ్‌ మరుగుదొడ్డికి వెళతానని చెప్పగా ఆయన అల్లుడు హరిప్రీత్ సింగ్ దారి చూపేందుకు వెళ్లారు. కాసేపటికే ఐదు రౌండ్ల కాల్పులు వినిపించాయి. రెండు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి హరిప్రీత్‌ సింగ్‌ కూలబడిపోయారు. ఆయన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. పారిపోతున్న మామ సిద్ధును కోర్టు ఆవరణలోని కొందరు న్యాయవాదులు పట్టుకుని ఒక గదిలో బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మల్వీందర్​ గతంలో ఏఐజీగా పనిచేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.