ETV Bharat / snippets

సుప్రీంలో కేజ్రీవాల్​కు ఎదురుదెబ్బ- బెయిల్ ఇవ్వలేమన్న కోర్ట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 12:28 PM IST

SC on Arvind Kejriwal Bail
SC on Arvind Kejriwal Bail (ANI)

SC on Arvind Kejriwal Bail: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం తెలిపింది.

కాగా, ఎక్సైజ్ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. తనను విడుదల చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్​కు బెయిల్ ఇవ్వలేమని తీర్పునిచ్చింది. అనంతరం ఈ పిటిషన్​పై విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది. కాగా, దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాకు ఆగస్టు 9న సుప్రీం బెయిల్‌ మంజూరు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.