ETV Bharat / snippets

మాట నిలబెట్టుకున్న రాహుల్​ గాంధీ- చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టు మెషీన్​ సాయం

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 9:04 AM IST

Rahul Gandhi Help To Cobbler
Rahul Gandhi Help To Cobbler (ETV Bharat)

Rahul Gandhi Help To Cobbler : తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాయం చేశారు. ఆ వ్యక్తికి కుట్టు యంత్రాన్ని పంపించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పరువు నష్టం కేసులో శుక్రవారం ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​లోని కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ వెళ్లారు. దారిలో రామ్​ చేత్​ అనే చెప్పులు కుట్టుకనే వ్యక్తి వద్ద ఆగి ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయం చేస్తామని హామి ఇచ్చి వెళ్లిపోయారు. శనివారమే రామ్​కు కుట్టు మెషీన్​ పంపించారు. చెప్పుల కుట్టుకునే వ్యక్తిని కలిసిన మరుసటి రోజే వారి కష్టాలను అర్థం చేసుకుని కుట్టు మెషీన్​ పంపించారని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ అన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పని సులవవుతుందని, మా నాయకుడిని చూసి గర్విస్తున్నా అని ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.