ETV Bharat / snippets

పారిస్ ఒలింపిక్స్​కు వెళ్తానన్న సీఎం - అనుమతి ఇవ్వలేమన్న కేంద్రం

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 1:26 PM IST

Punjab CM Mann
Punjab CM Mann (ANI)

Punjab CM Mann Denied Political Clearance To Visit Paris : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పారిస్ పర్యటనకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్న భారత హాకీ జట్టుకు దగ్గరుండి మద్దతు అందించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ భావించారు. దౌత్య పాస్‌పోర్టు కలిగిన భగవంత్‌ మాన్‌ నేటి నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు పారిస్‌ పర్యటన చేపట్టేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. దీనితో సీఎం కార్యాలయం కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించి అనుమతులు కోరింది. సీనియర్‌ రాజకీయ నాయకుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్‌ క్లియరెన్స్‌ తప్పనిసరి. అయితే, సీఎం మాన్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత ఉండటంతో, ఇంత తక్కువ సమయంలో ఆయనకు పారిస్‌లో ఆస్థాయి భద్రత కల్పించడం సాధ్యం కాదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.