ETV Bharat / snippets

అడ్వాణీ ఇంటికి మోదీ- బీజేపీ అగ్రనేతల ఆశీస్సులతో ముందడుగు

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 3:44 PM IST

PM Modi Meets LK Advani
PM Modi Meets LK Advani (ANI)

PM Modi Meets LK Advani : ఎన్​డీఏ పక్ష నేతగా ఎన్నికై, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలను కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్​కే అడ్వాణీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నివాసాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు మోదీ. మొదట అడ్వాణీ ఇంటికి వెళ్లి పుష్పం గుచ్ఛం ఇచ్చిన ప్రధాని, కాసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం అడ్వాణీ నివాసం నుంచి బయలుదేరిన మోదీ, బీజేపీ మరో దిగ్గజ నేత మురళీ మనోహార్‌ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధానికి సాదర స్వాగతం పలికిన మురళీ మనోహర్‌, శాలువా కప్పి మోదీని సత్కరించారు. తర్వాత ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఇంటికి వెళ్లి కలిశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.