ETV Bharat / snippets

'కోల్​కతా మెడికో హత్యాచారం నిరసనల వెనుక కేంద్రం కుట్ర!'

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 3:57 PM IST

Mamata Banerjee On Centre
Mamata Banerjee On Centre (ETV Bharat)

Mamata On RG Kar Protests : కోల్​కతా ఆర్​జీ కర్ ఆస్పత్రి​​ వైద్యురాలి హత్యాచారంపై జరుగుతున్న నిరసనలు- కేంద్ర ప్రభుత్వం కుట్ర అని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం అరోపించారు. ఇందులో వామపక్ష పార్టీల హస్తం కూడా ఉందన్నారు. దుర్గా పూజ సమీపిస్తున్నందున ప్రజలందరూ ఉత్సవాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్​ డాక్టర్లందరూ సాధ్యమైనంత త్వరగా విధుల్లో చేరాలని కోరారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సందర్భంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక, వైద్యురాలి తల్లిదండ్రులకు తాను డబ్బు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను మమత ఖండించారు. తానెప్పుడు డబ్బు ఆఫర్​ చేయలేదన్నారు. కోల్​కతా పోలీస్​ కమిషనర్ వినీత్​ గోయల్​ రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారని, కానీ దుర్గా పూజ సమీపిస్తున్న తరుణంలో తమకు లా అండ్​ ఆర్డర్​ తెలిసిన వాళ్లు అవసరమని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.