ETV Bharat / snippets

సీఎం పదవికి నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా- 24 ఏళ్లు ప్రజాసేవతో రికార్డ్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 12:57 PM IST

Naveen Patnaik resign
Naveen Patnaik resign (ANI)

Naveen Patnaik Resign : ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్‌(బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేడీపై బీజేపీ విజయం సాధించింది. దీంతో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి నవీన్​ పట్నాయక్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌కు సమర్పించారు. ఇప్పటి వరకు నవీన్‌ పట్నాయక్ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) ఒడిశా సీఎంగా విధులు నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.