ETV Bharat / snippets

'నీట్‌ పరీక్షలో మాల్​ప్రాక్టీస్‌ జరగలేదు'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 7:36 AM IST

Centre Additional Affidavit On NEET UG In SC
Centre Additional Affidavit On NEET UG In SC (ANI)

Centre Additional Affidavit On NEET UG In SC : నీట్‌ యూజీ 2024 పరీక్షలో మాస్​ మాల్​ప్రాక్టీస్‌ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాలు లేవని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మద్రాస్‌ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో, మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని పేర్కొంది. మార్కులు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్​ ప్రక్రియ, జూలై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. NEET-UG 2024పై గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.