చిత్తూరు జిల్లా వైసీపీలో అసమ్మతి సెగలు - ఎమ్మెల్యే సీటు కోరుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ - Dissent YCP Leaders Raise Voices

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 7:05 PM IST

ZP Chairperson in Chittoor District Spoke Dissent to MLA: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి మెుదలైంది. ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి అవకాశం ఇవ్వాలంటూ జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీనివాసులు అధిష్ఠానాన్ని కోరారు. శ్రీనివాసులు ప్రకటనతో పలమనేరు వైసీపీలో అసంతృప్తి వెల్లడైంది. ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటే గౌడను మార్చి తనను పోటీ చేయామని ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటానన్నారు. తనకు పలమనేరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ చాముండేశ్వరి సుధ, ఏఎంసీ ఛైర్మన్ హేమంత్ రెడ్డి మద్దతు ఉందని తెలిపారు. 

Dissent YCP Leaders Raise Voices : అదేవిధంగా పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి, పలమనేరు, గంగవరం ఎంపీపీలు రెడ్డప్ప, శ్రీదేవి, మురళీమోహన్‌ రెడ్డి తదితరులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. పలమనేరు స్థానానికి పోటీచేసే విషయమై అంతకుముందు ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. అయితే శ్రీనివాసులు వ్యాఖ్యలతో చిత్తూరులో మరో సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ తప్పదని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.