చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయి: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ - వసంత కృష్ణప్రసాద్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 10:40 PM IST
YSRCP MLA Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తున్నా కొన్నిసార్లు రాళ్లు, పూలు పడుతున్నాయని తెలిపారు. తన భవిష్యత్‌ను కాలమే నిర్ణయిస్తుందని వెల్లడించారు. గత యాభై సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్న ఆయన అభివృద్ధి కోసం ఎదురుచూడటమే ఎమ్మెల్యేల పనిగా మారిందన్నారు.
సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని ఎమ్మెల్యే ఆవేద వ్యక్తం చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కానీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబదించిన నిధులు కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, భవనాలను నిర్మించినా, వాటికి సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వంద సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే వసంత పేర్కొన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటుగా, అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారని వసంత వెల్లడించారు. పైన డబ్బులు లేక తాను ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.