పరిహారం ఇస్తామని మట్టి తవ్వేసుకున్నారు-న్యాయం చేయమంటే బెదిరిస్తున్నారు - YSRCP Leaders Occupy People Land - YSRCP LEADERS OCCUPY PEOPLE LAND

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 4:57 PM IST

YSRCP Leaders Occupied the Poor People Lands : శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరులో తమ భూములను వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కొండ పరిసరాల్లో ఉన్న 10 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలకు కేటాయించిందని బాధితులు తెలిపారు. తమ దగ్గర పట్టాలు ఉన్నా భూములను మాజీమంత్రి అప్పలరాజుతోపాటు కొందరు వైఎస్సార్సీపీ నేతలు బయపెట్టి బలవంతంగా ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు.  

తమ స్థలాన్ని తీసుకొని డబ్బులు ఇవ్వలేదని అడిగితే దాడి చేసేందుకు యత్నించారన్నారు. కొండను తవ్వేసి కోట్ల రూపాయలకు మట్టిని అమ్ముకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాధితులు వాపోయారు. భూములు ఇస్తే పరిహారంతోపాటు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మభ్య పెట్టారన్నారు. ఇప్పుడు స్థలాల కోసం అడుగుతుంటే బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతుంటే తమను బెదిరిస్తున్నారని మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. కూటమి ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.