200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకులు - పట్టించుకోని అధికారులు - Govt land kabza in YSR District - GOVT LAND KABZA IN YSR DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 1:35 PM IST
YSRCP Leaders Govt land Grab in YSR District : గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నాయకులు భూదాహంతో కనిపించిన భూములను మింగేశారు. ఏ భూమైనా సరే వారికి నచ్చిందంటే అది హాంఫట్. ప్రతి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భూమి అనే తేడా లేకుండా ఆక్రమించేశారు. నకిలీ పత్రాలు సృష్టించి, విలువైన భూములను కొట్టేశారు. కొన్నిచోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నారు న్యాయం చేయండంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా బాధితులను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ భూదోపిడీ పర్వాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కొత్తనల్లాయపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. మొత్తం 480 ఎకరాల్లో 200 ఎకరాలను చదును చేసి మొక్కలు నాటారని స్థానికులు తెలిపారు. తాజాగా మిగతా భూమిని ఆక్రమిస్తున్నారని చెప్పారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కబ్జాదారులపై తగు చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.