ఎంటీ మంత్రివర్యా ఈ దుశ్చర్య - ఓట్లకు పప్పు బెల్లల పంపీణీ తగునా! - ఓటు కోసం వృద్ధులకు బ్యాగులు పంపిణీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 1:33 PM IST
YSRCP Leaders Corrupted Gifts to Voters: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా యత్నాలు చేస్తున్నారు. వర్గాలుగా విభజించుకుని మరి వారికి తగిన రీతిలో తాయిలాలు సమర్పించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు గాలం వేసేందుకు తాయిలాలను ఎరగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో వయోవృద్ధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపసభాపతి వీరభద్రస్వామి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. వీరు కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులకు బ్యాగులు పంపిణీ చేశారు. సమ్మేళనం అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.
గుంటూరు పశ్చిమ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి విడదల రజిని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మైసూర్పాక్, లడ్డూ, బూందీ వంటి స్వీట్లతో కూడిన బాక్సులు పంపిణీ చేశారు. షబేబరాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి వీటిని అందజేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కానుకలతో గాలం వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.