సీఎం జగన్​పై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలి- డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు - Complaint to DGP on CM Jagan Attack - COMPLAINT TO DGP ON CM JAGAN ATTACK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 12:40 PM IST

YSRCP Leaders Complaint to DGP on CM Jagan Attack: సీఎం జగన్​పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ నాయకులు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని క్యాంప్‌ ఆఫీసులో డీజీపీని కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు(MLA Malladi Vishnu), మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు(Former Minister Ravela Kishore Babu) వినతిపత్రం అందించారు. సీఎం జగన్​పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. సీఎం జగన్​కు భద్రత పెంచాలని కోరినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఎన్నికల కమిషన్​కి ఇప్పటికే ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. జగన్ దాడి కేసును సీఐడీ విచారణ(CID Investigation)కు ఆదేశించాలని ఎన్నికల కమిషన్​(Election Commission)ను విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

"సీఎం జగన్​పై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. సీఎం జగన్​కు భద్రత పెంచాలని కోరాం." - మల్లాది విష్ణు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.