వెంకన్న దర్శనం అయినా అవుతుంది కాని జగన్ను కలవటం కుదరదు: వైసీపీ నేత తాడిశెట్టి మురళి - Thadishetti Murali against YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 8:22 PM IST
YSRCP Leader Thadishetti Murali Fired on YSRCP Government: వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లైనా దర్శించుకోవచ్చు కానీ జగన్ను కలవటం కష్టమని గుంటూరు మాజీ డిప్యూటి మేయర్, వైఎస్సార్సీపీ నేత తాడిశెట్టి మురళి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీలో దళారీ వ్యవస్థతో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని తాడిశెట్టి మురళి (Thadishetti Murali) పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో (Elections) వైఎస్సార్సీపీ గెలుపు కోసం పనిచేశామని కానీ పార్టీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని మురళి ఆవేదన వెలిబుచ్చారు. తాము సూచించిన వారికి ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవటంతో ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీకి పనిచేయమని వారికి చెప్పలేక పోతున్నామని మురళి తెలిపారు. మరో రెండ్రోజుల్లో ఆత్మీయులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు భవిష్యత్ కార్యాచరణ (Future Plan) ప్రకటిస్తామన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నా జగన్మోహన్ రెడ్డి కోసం భరించామని చివరకి ఆయనే న్యాయం చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని మురళి స్పష్టం చేశారు. వైసీపీలో బీసీలకు అన్యాయమే జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల ప్రభావం 50 నియోజకవర్గాల్లో ఉంటుందని మురళి పేర్కొన్నారు.