హుద్‌హుద్ బాధితుల ఆశలు గల్లంతు- టీడీపీ కట్టించిన ఇళ్లపై జగన్ ప్రభుత్వం వివక్ష - YSRCP Govt Neglect of Hudhud Houses - YSRCP GOVT NEGLECT OF HUDHUD HOUSES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 11:11 AM IST
YSRCP Neglect Hudhud Houses in Srikakulam : రాష్ట్రంలో 2014లో హుద్‌హుద్ తుపాను బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని వందలాది గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వేలాది మంది సర్వసం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే బాధితుల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇళ్లను కట్టించింది. అవి లబ్ధిదారులకు చేతికందే సమయానికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో వారి ఆశలపై నీళ్లు చల్లింది.
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో అవి శిథిలావస్థకు చేరాయి. ఇళ్ల చుట్టూ ముళ్ల పొదలు దట్టంగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఎవ్వరి పర్యవేక్షణ లేకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారాయి. పేదల కోసం నిర్మించిన ఇళ్లు ఇలా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారాయని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి వాటిని బాగు చేసి పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. ఈ తరుణంలో ఇళ్ల తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేశ్ అందిస్తారు.