వైసీపీ కార్యాలయంలో భారీ ఎత్తున తాయిలాలు- ఆటోలతో స్థానిక నేతల ఇళ్లకు తరలింపు - YSRCP Gifts Transport Issue - YSRCP GIFTS TRANSPORT ISSUE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 5:58 PM IST
YSRCP Gifts Transport Issue: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైసీపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార వైసీపీ నేతలు భారీ ఎత్తున తాయిలాలు సిద్ధం చేస్తున్నారు. అనంతపురం పార్టీ కార్యాలయం నుంచి బహుమతుల సంచులను ఆటోలతో స్థానిక కార్యకర్తలు, నాయకుల ఇళ్ల వద్దకు సరఫరా చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పెద్ద ఎత్తున వచ్చిన బహుమతులను తొలుత పార్టీ కార్యాలయంలో ఉంచారు.
అనంతరం అక్కడ నుంచి ఆటోలతో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. బహిరంగంగానే బహుమతుల సంచులు తరలిస్తున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు గానీ కనీసం అటువైపు చూసిన పాపాన పోలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఆదేశాలను బేఖాతరు చేసి వైసీపీ నాయకులు విచ్చల విడిగా వ్యవహారాలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. బహుమతుల సంచులు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి తరలించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.