వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కుటుంబ కథా చిత్రమ్- శిలాఫలకాలపై ఫ్యామిలీ - YSRCP STONE PLAQUES REMOVED - YSRCP STONE PLAQUES REMOVED
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 5:29 PM IST
YSRCP foundation Stones Removed by TDP MLA: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఫొటోలతో వేసుకున్న శిలాఫలకాలను తొలగించారు. టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఇవాళ పాత గుంటూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తఫాతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫొటోలతో ఉన్న శిలాఫలకాలు చూసి నివ్వెరపోయారు. సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ముస్తఫా కుటుంబసభ్యుల ఫొటోలు ఉన్నాయి. ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఫొటో ఉండొచ్చు కానీ, ఇంట్లో వారి ఫొటోలు వేసుకోవటాన్ని తప్పుబట్టారు.
ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. వాటిని తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు. ఎమ్మెల్యే నజీర్ స్వయంగా ఓ శిలాఫలకాన్ని పగులగొట్టారు. ఎన్టీఆర్ కాలనీ, శివనాగరాజు కాలనీ, రాజేంద్రనగర్‌లలో ఉన్న మరో 17 శిలాఫలకాలను కూడా తొలగించాలని అధికారుల్ని ఆదేశించారు. 2019 నుంచి 2024తో పాటు 2014 -19 టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు సైతం ఈ తరహా శిలాఫలకాలు వేసుకున్నారు. తమ సొంత నిధులతో పనులు చేసినట్లుగా ముస్తఫా కుటుంబ సభ్యుల ఫొటోలతో శిలాఫలకాలు వేయటం ఆశ్చర్యానికి గురి చేసిందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు.