వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జా: చంపేస్తానంటూ బెదిరింపులు - కేతిరెడ్డి అనుచరులు భూ కబ్జా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-01-2024/640-480-20602777-thumbnail-16x9-ysrcp-followers-land-occupied-in-dharmavaram.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 1:14 PM IST
YSRCP Followers Land Occupied in Dharmavaram: అధికార వైసీపీ నాయకులు కొందరు తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించి, బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా, రౌడీలతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని, కేతిరెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు.
Death Threats: బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీదేవి హైకోర్టు ఎడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. పోతుల నాగేపల్లిలోని జగనన్న కాలనీ వద్ద తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించి కట్టడాలను ధ్వంసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులైన అంజి, శ్రీకాంత్ రెడ్డి మరో ఇద్దరు వచ్చి తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. కమిషనర్‌కు డబ్బులు ఇచ్చాము, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నారని శ్రీ దేవి చెప్పారు.