అడుగడుగునా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ- చూసీ చూడనట్లు ఎన్నికల అధికారులు! - YSRCP Election Code Voilation - YSRCP ELECTION CODE VOILATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 1:37 PM IST
YSRCP Election Code Voilation in Mangalagiri : మంగళగిరిలో అడుగడుగునా ఎన్నికల నిబంధనలను వైఎస్సార్సీపీ ఉల్లంఘించింది. జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు జాతీయ రహదారి అంతటా పార్టీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శించారు. నాడు మోదీ సభకు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టనివ్వకుండా అడ్డుపడి నేడు విచ్చలవిడిగా అనుమతించారంటూ మండిపడ్డారు.
ఎన్ఆర్ఐ వై జంక్షన్, సీకే కన్వెన్షన్, తాడేపల్లి ప్రాంతాలలో ఇష్టానుసారం బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్కు ఇవేమీ కనిపించడం లేదా అంటూ ప్రతిపక్షాలు నిలదీశాయి. ఈ విధంగా అధికారులు వ్యవహరిస్తే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని ఎలా ధీమాగా ఉండగలం అని పలువురు మండిపడ్డారు. ఎన్నికల కోడ్లో ఒక్కో పార్టీకి ఒక్కో విధమైన నిబంధనలు ఉన్నాయా అని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు.