నంద్యాలలో ఎటు చూసినా సిద్దం సభ బ్యానర్లే - సీఎం సారుకు ఎన్నికల కోడ్​ వర్తించదా? - YSRCP Election Code Violation - YSRCP ELECTION CODE VIOLATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 3:48 PM IST

YSRCP Election Code Violation Siddham Flex in Nandyal : నంద్యాలలో వైఎస్సార్సీపీ నిర్వహించే  మేమంతా సిద్ధం కార్యక్రమం సందర్భంగా రహదారికి  ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు వస్తున్నా వైఎస్సార్సీపీ నాయకులు (YSRCP leaders ) వాటిని పట్టించుకోలేదు. నంద్యాల (Nandyala) బొమ్మలసత్రం వంతెనపై వాహనదారులు ఇబ్బంది పడేలా ఫ్లెక్సీలు పెట్టారు.

Siddham Flexi : జగన్మోహన్​ రెడ్డి (Jagan Mohan Reddy) అట్టహాసంగా ప్రారంభించిన ఎన్నికల ప్రచారం తుస్సుమన్నా మళ్లీ ఎక్కడ సభ నర్వహించినా రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు కట్టడం మాత్రం మారలేదు. ఇంటింటి ప్రచారాలు, పాంప్లెట్లు పంపడానికే సువిధ పోర్టల్​లో (Suvidha Portel) రిజిస్ట్రేషన్​ చేయించుకుని, అనుమతులు పొందాలని ఎన్నికల సంఘం పేర్కొంది. అయినప్పటికీ అధికార పార్టీకి ఆ ఆజ్ఞలేవీ పట్టడం లేదు. సభలు నిర్వహిస్తూ ఎన్నికల కోడ్​ ఉల్లంఘిస్తూ ఎటు చూసినా సిద్దం బ్యానర్లు కట్టారు. నద్యాల మొత్తం బ్యానర్ల మయం అయిపోయింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.