ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం - election campaign in aasara program
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 9:17 PM IST
YSRCP Election Campaign in Government Program : ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు నాయకులకు ఆహ్వానం పలుకుతూ వారి చేతుల మీదుగా ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంఘటన గుంటూరు జిల్లాలో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రత్తిపాడులో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్‌కి, తనకు ఓటు వేయాలని డ్వాక్రా మహిళలను కిరణ్ కుమార్ వేడుకున్నారు. ఆసరా చెక్కుల పంపీణి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాటలు పెట్టారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఆసరా కార్యక్రమానికి వేరే గ్రామాల నుంచి మహిళలను ఆటోల ద్వారా తరలించారు. ఈ కార్యక్రమానికి కిరణ్ కుమార్ ఆలస్యంగా రావడం వల్ల కొంత మంది మహిళలు ఇంటి బాట పట్టారు. గ్రామాలలో తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేలా మహిళలకు చెప్పాలని యానిమేటర్లకు చీరలు కూడా పంపీణి చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.