కదిరి వైసీపీలో భగ్గమన్న అసమ్మతి- ఎమ్మెల్యే శంకుస్థాపనలను అడ్డుకున్న సర్పంచ్ - కదిరిలో బండ్లపల్లి సర్పంచ్ నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 10:00 PM IST
YSRCP Class War in Kadiri Constituency: శ్రీ సత్యసాయి జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని తలుపుల మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అడ్డుకున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులను తనకు సమాచారం ఇవ్వకుండా, తాను ప్రతినిథ్యం వహిస్తున్న గ్రామంలో శంకుస్థాపన ఎలా చేస్తారని, గ్రామ సర్పంచ్ కొండారెడ్డి అడ్డుకునేందుకు యత్నించారు. సర్పంచ్‌ను పట్టించుకోకుండా ఎమ్మెల్యే పనులను ప్రారంభించి ముందుకు సాగారు. దీంతో సర్పంచ్ మరో శిలఫలకం వద్ద బైఠాయించారు. తనకు ఎందుకు సమాచారం అందిచలేదని, ఆహ్వానించలేదని సర్పంచ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దీనిపై సమాధానం చెప్పేవరకు అక్కడ్నుంచి లేచేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో పోలీసులు సర్పంచ్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. సొంత పార్టీ సర్పంచ్‌పైనే ఎమ్మెల్యే సైకోలా ప్రవరిస్తున్నాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పూల శ్రీనివాస రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే బండ్లపల్లి సర్పంచ్ పూల శ్రీనివాస రెడ్డికి మద్దతు ఇస్తూ వస్తున్నారు.