ప్రచారంలో కోడ్ మరిచి భారీ ఎత్తున బాణసంచా - భయభ్రాంతుల్లో స్థానికులు - Simhadri Rameshbabu Campaign - SIMHADRI RAMESHBABU CAMPAIGN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 3:45 PM IST
YSRCP candidate Simhadri Rameshbabu Campaign in Mopidevi Traffic Problems to People : కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేశ్‌బాబు అనుచరులు, అల్లరి మూకలు పేట్రేగిపోయారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ భారీ ఎత్తున టపాసులు కాల్చారు. ర్యాలీలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట నడి రోడ్డుపై ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
వీరి వికృత చేష్టలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆలయం ఎదుట పది నిమిషాలకు పైగా బాణసంచా పేల్చడంతో గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇంతా జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారు. సుమారు అరగంట సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మోపిదేవిలో సింహాద్రి రమేశ్‌బాబు శుక్రవారం రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.